28-07-2025 06:48:34 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి..
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..
దేవరకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని బీఆర్ఎస్ పార్టి నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్(Former MLA Ramavath Ravindra Kumar) పిలుపునిచ్చారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కొండమల్లేపల్లి మండలంలోని చింతచెట్టు తండా, వడ్త్యా తండా, జేత్య తండా, పుల్ సింగ్ తండాలకు చెందిన సుమారు 100 మంది యువకులు, రైతులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టిలో చేరిన వారికి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన దేవరకొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలి అని కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పాలి కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులనుగెలిపించుకోవాలని కోరారు. పార్టీలో చేరిన వారు యువ నాయకులు నేనావత్ దేవేందర్, మాజీ సర్పంచ్ భద్రు నాయక్ తదితరులు పార్టిలో చేరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దశ్రు నాయక్, రైతు బంధు మాజీ అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులిసిరం, పెద్దిశెట్టి సత్యం తదితరులు పాల్గొన్నారు.