calender_icon.png 29 July, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 రద్దు చేయాలని ర్యాలీ

28-07-2025 06:55:58 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలో జీవో నెంబర్ 49 రద్దు చేయాలని రైతులు, గిరిజన నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే మహాధర్నా కార్యక్రమానికి ఆదివాసీ నాయకులు, రైతులు వాహనాల ద్వారా కలెక్టరేట్ చేరుకొని మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవో నెంబర్ 49 తాత్కాలిక నిలిపివేత కాకుండా పూర్తిగా రద్దుచేసి తీరాలని డిమాండ్ చేశారు. 49 జీవోతో మారుమూల ప్రాంతాలైన గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని ఆదివాసి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 49 వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదివాసి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోల్క వెంకటేష్, పెద్దల సంతోష్, మేడి సతీష్, కొడుప శంకర్, చౌదరి గంజిరాం గిరిజన నాయకులు రైతులు పాల్గొన్నారు.