28-07-2025 06:51:32 PM
గట్టుప్పల ఎస్సై సంజీవరెడ్డి..
చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): డ్రగ్స్ వాడకం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని గట్టుప్పల ఎస్సై సంజీవరెడ్డి(SI Sanjeeva Reddy) అన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత, గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, సోషల్ మీడియా ద్వారా కలుగుతున్న మోసాలకు బలయ్య ప్రమాదం ఉందని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకం, పిల్లల రక్షణ (Pocso చట్టం), ఆన్లైన్ మోసాలు, మహిళలపై నేరాలు, సైబర్ నేరాల గురించి ఆయన వివరించారు. నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలో నైతిక విలువలు, భద్రతపై జాగ్రత్తలు పెంచుతాయని ఆయన అన్నారు. సైబర్ నేరాలపై1930 లేదా సైబర్ సెల్ ను సంప్రదించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, పోలీస్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.