28-07-2025 07:29:40 PM
తహసిల్దార్ అశోక్..
కొండాపూర్: మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై ఇస్తున్న దరఖాస్తులు తహసిల్దార్ అశోక్(Tahsildar Ashok) స్వీకరించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ అశోక్ మాట్లాడుతూ... ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజలు వారి సమస్యలు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని తెలిపారు. ప్రజావాణిలో 11 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే విధంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.