28-07-2025 07:27:04 PM
మీ సహాయం నా కుటుంబానికి చాలా పెద్ద ఊరటనిస్తుంది..
మంత్రి ఉత్తమ్ కు సోషల్ మీడియా ద్వారా దివ్యాంగుడు భూక్యా నరసింహ వేడుకోలు..
హుజూర్ నగర్: మంత్రి ఉత్తమ్ సార్ జర ఇల్లు మంజూరు చేయండి అంటూ ఓ దివ్యాంగుడు... స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని సోమవారం సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు... హుజూర్‌నగర్ పట్టణంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, జీవనోపాధి కోసం నేను సమోసాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నేను దివ్యాంగుడను, చాలా నిరుపేద స్థితిలో ఉన్నాను. నాకు సొంత స్థలం కానీ,ఇల్లు కానీ లేదు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను.ఆశ్రయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను.
వృద్ధాప్యం, వైకల్యం, ఆర్థిక లేమి కారణంగా నాకు సొంత ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం తన జీవితంలో అసాధ్యంగా మారింది. వానాకాలంలో, చలికాలంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని, మీ ద్వారా ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద ఉన్న సింగల్ బెడ్ రూం ఇల్లు కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని మీ సహాయం నా కుటుంబానికి చాలా పెద్ద ఊరటనిస్తుందని మిమల్ని కోరుకుంటున్నాను అని మంత్రి ఉత్తమ్ ను వేడుకున్నాడు.