16 March, 2026 | 9:21 AM

కిన్నెర మొగులయ్యకు ఇంటిస్థలం

25-09-2024 12:46 AM

స్థల ధృవీకరణ పత్రం అందచేసిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ప్రముఖ కిన్నెర వాద్యకారుడు, పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు రాష్ట్ర ప్రభు త్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఇందు కు సంబంధించిన ధృవపత్రాన్ని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి మంగళవారం మొగిలయ్యకు అందజేశారు.

హయత్‌నగర్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ ధృవప త్రాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ముఖ్యమంత్రి మొగిలయ్యకు ఇచ్చారు. తనకు ఇంటి స్థలాన్ని కేటాయించడం పట్ల మొగిలయ్య సంతోషం వ్యక్తంచేస్తూ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.