30-07-2025 03:47:22 PM
ఏఎంసీ చైర్మన్ ల సన్మానంలో కిసాన్ సీల్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి
మంథని,(విజయక్రాంతి): కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం దక్కుతుందని అందుకు మంథని, కమాన్ పూర్ నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ లను, డైరెక్టర్లు నిదర్శనమే అని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనగామ నరసింహారావు లేచితో కలిసి చైర్మన్ లను డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడిన కార్యకర్తలను గుర్తించి మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబులు పదవులు అప్పగించడం శుభసూచకం అన్నారు. పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.