04-02-2025 12:00:00 AM
నెయ్యి పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
అల్లం ముక్కలు ఎండబెట్టి టీలో వేస్తే ఆ టీ ఎంతో రుచిగా ఉంటుంది.
యాలకులు ఫైన్ పౌడర్ లా రావాలంటే కొద్దిగా చక్కర వేసి గ్రైండ్ చేసుకోవాలి.
నిమ్మకాయలు తాజాగా ఉండాలంటే ఒక పేపర్‌లో వాటిని చుట్టి జిప్ లాక్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే చాలాకాలం తాజాగా ఉంటాయి.
పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.