calender_icon.png 31 January, 2026 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరుగుతో మెరిసిపోదాం!

04-02-2025 12:00:00 AM

అందం కోసం రకరకాల క్రీమ్స్, ఫేషియల్స్ ట్రై చేస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సహజంగా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా చేసుకోవచ్చు. అది ఎలాగంటే..డైమండ్ ఫేషియల్‌తో.. డైమండ్ ఫేషియల్ అంటే ఏంటో కాదు.. పెరుగుతో ముఖ సౌదర్యాన్ని రెట్టింపు చేసుకోవడం.

పెరుగు ఒక అద్భుతమైన సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ముడతలు, గీతలు తగ్గించి, బ్లీచింగ్‌లా పనిచేస్తుంది. ముఖానికి సహజమైన కాంతిని అందిస్తుంది. 

ముఖానికి కొద్దిగా పుల్లటి పెరుగు తీసుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు తగ్గుతాయి. ఇది చర్మానికి సహజమైన బ్లీచింగ్. 

పెరుగులో చక్కెర, కాఫీ పొడిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ స్క్రబ్‌ను ముఖానికి అప్లు చేసి స్క్రబ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే.. ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. 

టమాట గుజ్జులో పెరుగు కలిపి ముఖానికి అప్లు చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి, నెలకు రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గి.. కాంతివంతంగా మారుతుంది.