14-01-2026 01:25:10 AM
సంయుక్త ఫర్టిలిటీ సొల్యూషన్ ఆధ్వర్యంలో..
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): సంయుక్త ఫర్టిలిటీ సొల్యూషన్ వారి ఆధ్వర్యం లో 25 మందికి పైగా దివ్యాంగ కళాకారులతో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించా రు. రంగోలి పోటీలకు న్యాయనిర్ణేతగా డా. సంయుక్తరెడ్డి వ్యవహరించారు. తుకారాం గేట్, సికింద్రాబాద్ నందు నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో 25 మందికి పైగా దివ్యాంగ కళాకారులు పాల్గొని తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు.
రంగురంగుల ముగ్గులతో పాటు కళకు అడ్డంకులు ఉండవుఅనే సందేశాన్ని ఈ కార్యక్రమం ఎక్సుక్యూషన్ పార్ట్‌నర్: ఎక్స్‌ట్రా మైల్ వెల్ఫేర్ సొసైటీ సమాజానికి అందించనుంది. ఈ విశిష్ట సాంస్కృతిక కార్యక్రమానికి ఫెర్టిలిటీ నిపుణురాలు, డా. సం యుక్తరెడ్డి ఫెర్టిలిటీ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలైన డా. సంయుక్తరెడ్డి హాజరై న్యాయనిర్ణేత గా వ్యవహరించారు. రెండు దశాబ్దాలకు పైగా వైద్య అనుభవం కలిగిన డా. సంయుక్త రెడ్డి, వైద్య నైపుణ్యంతో పాటు సామాజిక బాధ్యతను కలగలిపిన వ్యక్తిగా విస్తృతంగా గౌరవిం చబడుతున్నారు.