1 March, 2026 | 3:12 PM

సూపర్ 8లో అజేయ ఇంగ్లాండ్

28-02-2026 01:55 AM

గెలిచే మ్యాచ్ లో ఓడిన కివీస్

పాక్ సెమీస్ ఆశలు సజీవం

కొలంబో, ఫిబ్రవరి 27: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేస్ మరింత ఉత్కంఠగా మారిపోయింది. ముఖ్యంగా సూపర్ 8 గ్రూప్ 2లో ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ లోనూ గెలిచి రేసును రసవత్తరంగా మార్చేసింది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న ఇంగ్లీష్ టీమ్ ఓడిపోయే మ్యాచ్ లో కివీస్ పై గెలిచింది.

ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న న్యూజిలాండ్ చివర్లో పట్టుసడలించి ఓటమి చవిచూసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ గెలుపుతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్‌గెలిచి బ్యాటిం గ్ ఎంచుకుంది. స్పిన్ పిచ్ కావడంతో మంచి టార్గెట్ నిర్థేశించే లక్ష్యంతో వేగంగా ఆడింది. ఈ క్రమంలో వికెట్లు కూడా కోల్పోయింది. ఓపెనర్లు స్టివర్ట్ ,. ఫిన్ అలెన్ తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. 

స్పిన్నర్ల ఎంట్రీతో కివీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులు చేయడంతో మంచి స్కోరు సాధించిం ది. చివరి మూడు ఓవర్లలో వికెట్లు చేజార్చుకున్నా పరుగులు చేయగలిగింది.  ఫలితంగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ , రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో కివీస్ పేసర్లు విజృంభించడంతో ఆరంభంలోనే ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోయింది.