calender_icon.png 23 January, 2026 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేకే 5 గనిలో ప్రమాదం

19-09-2024 01:38:17 AM

కార్మికుడి మృతి

మందమర్రి, సెప్టెంబర్ 18: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో కోల్ కట్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మోకెనపల్లి లక్ష్మణ్ మృతి చెందాడు. లక్ష్మణ్ సెకండ్ షిప్టు విధులు ముగించుకుని గని ఉపరితలానికి మ్యాన్ రైడింగ్‌పై వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతిచెందా డు. లక్ష్మణ్‌కు భార్య, కొడుకు, కూతు రు ఉన్నారు. లక్ష్మణ్‌ది గని ప్రమాదం గా గుర్తించి ప్రమాద బీమా, బ్యాంకు బీమా వర్తింపజేయాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు.