calender_icon.png 7 July, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 36 ఫిర్యాదులు

27-05-2025 12:00:00 AM

 నారాయణపేట.మే 26(విజయ క్రాంతి) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 36 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, జడ్. పి. సి. ఈ. ఓ. శైలేష్ కుమార్ కు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎ. ఓ. జయసుధ, డీ ఆర్ డీ వో మొగులప్ప, వివిధ శాఖల అధికారులు, తదితరులుపాల్గొన్నారు.