1.10 కిలోల గంజాయిని పట్టుకున్న కోదాడ పోలీసులు..
నలుగురి అరెస్ట్
- వివరాలు వెల్లడించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
కోదాడ ఆగస్టు 26: కోదాడ పట్టణ పోలీసులు 1.10 కిలోల గంజాయిని పట్టుకొని, నలుగురిని అరెస్ట్ చేసినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కోదాడలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ పోలీసులు అనంతగిరి రోడ్డులో బోడిగుట్ట వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, కోదాడ పట్టణానికి చెందిన సాలె వేణు, ఉల్లెందుల సుదర్శన్ అలియాస్ సాహు ఇద్దరు కలిసి గంజాయి అమ్ముతున్నారని, వీరి వద్ద చిలుకూరు మండలం రామాపురంకు చెందిన పోలంపల్లి సాయి సుమంత్, రెళ్ళ గోపిలు గంజాయి కొనుగోలు చేయడానికి వచ్చారని, ఈ నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
వీరి వద్ద నుండి 1.10 కిలోల గంజాయితో పాటు 3 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రాధమిక విచారణలో సాలె వేణు, ఉల్లెందుల సుదర్శన్ అలియాస్ సాహు ఇద్దరు కలిసి బీహార్ రాష్ట్రానికి చెందిన పంకజ్ వద్ద పెద్ద మొత్తంలో గంజాయి కొనుగోలు చేసి, వీటిని చిన్న చిన్న పాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. బీహార్ కు చెందిన పంకజ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రమాండ్ కు తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ శివశంకర్, ఎస్త్స్ర ఉపేందర్ రెడ్డి, ఎస్త్స్ర అజయ్ కుమార్, ఎస్త్స్ర చిన్న మల్చూరు, ఏఎస్‌ఐ ఖయ్యూం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






