సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని ‘బీఆర్‌ఎస్’ ధర్నా
రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ మహాధర్నా
హుజూర్ నగర్, ఆగష్టు 26: రైతుల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగర్ ఎడమ కాలువ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటె ద్దు నరసింహారెడ్డి మాజీ జెడ్పిటిసి,నియోజకవర్గ నాయకుడు కొప్పుల సైదిరెడ్డి ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద బిఆర్‌ఎస్ పార్టీ మాజీ జెడ్పిటిసి, హుజూర్ నగర్ నియోజకవర్గ నాయకుడు కొప్పుల సైదిరెడ్డి ఆధ్వర్యం లో మహాధర్నా నిర్వహించారు.
నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ...గత కెసిఆర్ ప్రభుత్వంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ లో నీరు ఉన్న ఈ ప్రాంత రైతులను దృష్టిలో పెట్టుకొని ఎడమ కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీకే దక్కిందన్నారు.నేడు నాగా ర్జునసాగర్ ప్రాజెక్టులో 535 పైచీలుకు అడుగుల మేర నీరు ఉన్న రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఈ ప్రాంత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
ఒక పక్క పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుండి అక్రమ నీటిని తరలించుకుపోతున్న తెలంగాణ సీ ఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఏమాత్రం ప ట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను ప్ర భుత్వం వెంటనే పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బిఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.రైతుల ప్ర యోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జక్కుల నాగేశ్వర రావు,బెల్లంకొండ అమర్,మన్యం శ్రీనివాస్ రెడ్డి, ఇరుగు పిచ్చయ్య,ములకలపల్లి రాంబాబు, పచ్చిపాల ఉపేందర్ ,తదితరులు పాల్గొన్నారు.






