శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విజయవంతం చేయాలి
కోదాడ, ఆగస్టు 30 : త్రైత సిద్ధాంతం వా రి మార్గదర్శకత్వంలో సెప్టెంబర్ 4వ తేదీన కోదాడ మండలంలోని కాపుగల్లు గ్రామం లో శ్రీకృష్ణ మందిరం ఆవరణలో నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విజ యవంతం చేయాలని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ సభ్యులు పిలుపునిచ్చారు.
ఆదివారం కాపుగల్లు గ్రామ సర్పంచ్ దొంతగాని అప్పారావుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ప్రబోధ సేవా సమితి కో దాడ శాఖ సభ్యులు మాట్లాడుతూ సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ మందిరంలో ఉద యం కృష్ణ ప్రతిమ వద్ద గురు శ్లోకాలతో పూ జ ఉంటుందన్నారు. మధ్యాహ్నం కృష్ణ ప్రతిమను పల్లకీలో ఏర్పాటుచేసి గ్రామంలో ఊ రేగింపు నిర్వహిస్తామన్నారు. కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చే శారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు.






