26-07-2024 04:13:03 PM
హైదరాబాద్: తెంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి తరుపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని న్యాయవాదులు తెలిపారు. ఈ మేరకు లాయర్ మయూర్ రెడ్డి పలు కోర్టుల తీర్పులను చదివి వినిపించారు. వాదనాలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది.