calender_icon.png 4 September, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కోలేటి శివప్రసాద్

04-09-2025 05:05:44 PM

మందమర్రి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులుగా పట్టణానికి చెందిన కోలేటి శివప్రసాద్ ను నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించిన జిల్లా అధ్యక్షులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై పార్టీ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తూనే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేస్తానన్నారు.