calender_icon.png 4 September, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది

04-09-2025 05:01:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది.. అన్ని వృత్తుల కెల్లా ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్(Assistant Commissioner of Examinations Mudarapu Parameshwar) అన్నారు. గురువారం ప్రభుత్వ బాలిfకల ఉన్నత పాఠశాల సోమవార్ పేట్ నిర్మల్ యందు ముందస్తుగా నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ... చీకటిలాంటి అజ్ఞానాన్ని గురువు తొలగించి వెలుతురు లాంటి జ్ఞానాన్ని అందిస్తాడని అన్నారు. గురువు నేర్పిన విద్యాబోధనల వల్లనే ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందని దానికి ఉపాధ్యాయుడే మార్గదర్శకుడు అని అన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోకు పూలతో నివాళులర్పించి, ఆయన విద్యారంగానికి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థినిలు ఉపాధ్యాయులను సన్మానించి పెన్నులను బహుకరించారు.