కోల్కతా పీజీ డాక్టర్ హత్యాచార కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
22-08-2024 12:08 PM
న్యూఢిల్లీ: కోల్కతా పీజీ డాక్టర్ హత్యాచార కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించింది. సీబీఐ దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. టాస్క్ఫోర్స్ కమిటీలో రెసిడెంట్ డాక్టర్లను సభ్యులుగా చేర్చాలని సీబీఐ కోరింది. రెసిడెంట్ డాక్టర్లను కూడా టాస్క్ఫోర్స్లో సభ్యులుగా చేర్చాలని.. ఫైమా చేసిన వాదనలపై సుప్రీంకోర్టు స్పందించింది. రెసిడెంట్ డాక్టర్లు ఇచ్చిన సమాచారం, సూచనలు ముఖ్యమైనవని తెలిపింది. జాతీయ టాస్క్ఫోర్స్ అందరి అభిప్రాయాలు వినాలని.. ఉత్తర్వుల్లో మరోసారి స్పష్టం చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.






