25 June, 2026 | 12:32 AM

ఓటముల ఒత్తిడిలో కేకేఆర్… గుజరాత్ ఛాలెంజ్!

17-04-2026 01:20 AM

గుజరాత్ తో కీలక మ్యాచ్

తీవ్ర ఒత్తిడిలో రహానే

ఫామ్‌లో ఉన్న గిల్, బట్లర్

అహ్మదాబాద్, ఏప్రిల్16: ఐపీఎల్ 2026 సీజన్ మొదలై మూడు వారాలవుతోం ది. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు గెలుపును రుచి చూసాయి. కానీ ఒకే ఒక జట్టు మాత్రం ఇప్పటి వరకూ విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ టీమ్ మరేదో కాదు కోల్‌కతా నైట్ రైడర్స్. కీలక ఆటగాళ్లంతా సమిష్టిగా విఫలమవుతున్న వేళ కేకేఆర్ ఇప్ప టి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలు గు ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్లను పంచుకుంది.

IPL 2026 పాయింట్స్ టేబుల్ కోసం మా Sports సెక్షన్ చూడండి

ఈ పరాజయాల పరంపరకు తెరదించాలనుకుంటున్న కోల్‌కతా శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తలపడబోతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నిజానికి కోల్‌కతా జట్టు పేపర్‌పై బలంగానే ఉన్నా గ్రౌండ్‌లో మా త్రం తేలిపోతోంది. ఏకంగా రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న గ్రీన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్‌లోనూ సరిగ్గా ఆడ లేదు.

బంతితో కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు.  దీంతో అతని స్థానంలో మరొక ప్లే యర్‌ను ఆడించాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ రహానే, ఫిన్ అలెన్ కూడా నిరాశపరుస్తున్నారు. రఘువంశీ పర్వాలేదనిపిస్తున్నా మిగి లిన బ్యాటర్లు ఎవ్వరూ రాణించడం లేదు. రింకూ సింగ్ ఒక్క మ్యాచ్‌లోనూ తన సత్తా చాటలేకపోయాడు. రమణ్ దీప్ సింగ్, రోవమన్ పావెల్‌పై అంచనాలున్నాయి. అటు బౌలింగ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మిస్టరీ అంతా హిస్టరీలో కలిసిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

వైభవ్ అరోరా, అంకుల్ రాయ్ భారీ గా పరుగులు ఇచ్చేస్తుండగా కార్తీక్ త్యాగీ పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలర్లు కూడా పూర్తిగా గాడిన పడితేనే కోల్‌కతా తొలి విజయాన్ని అందుకునే అవకాశముంటుంది. ప్ర స్తుతం కోల్‌కతా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరోవై పు గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి ఒత్తిడిలో పడిన గుజరాత్ తర్వాత అద్భుతంగా పుంజుకుంది,. వరుసగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూప ర్ జెయింట్స్‌పై విజయాలు నమోదు చేసింది.

గుజరాత్ బ్యాటింగ్‌లో బట్లర్, కెప్టెన్ గిల్ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో లక్నోపై సాయి సుదర్శన్ నిరాశపరిచినా బట్లర్, గిల్ మాత్రం అదరగొట్టారు. తెవాటియా, వాషింగ్టన్ సుందర్ చివరి ఓవర్లలో హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్నవారే. అటు బౌలింగ్‌లో రబాడ, సిరాజ్, ప్రసిద్ధ కృ ష్ణ పేస్ భారాన్ని మోస్తుండగా.. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ కీలకంగా ఉన్నాడు. వా షింగ్టన్ సుందర్‌తో పాటు రషీద్ కూడా రాణిస్తే తిరుగుండదు. 

ఇలాంటి క్రికెట్ అప్‌డేట్స్ కోసం మా హోమ్‌పేజీని ఫాలో అవ్వండి


గత రికార్డులు

ఇరు జట్లు నాలుగుసార్లు తలపడితే మూడు మ్యాచ్‌లలో గుజరాత్ గెలిచింది. కోల్‌కతా ఒకసారే గెలిచింది. 

పిచ్ రిపోర్ట్ 

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశముంది.

తుది జట్లు అంచనా

కోల్‌కతా నైట్‌రైడర్స్ : ఫిన్ అలెన్, రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, రమణ్ దీప్‌సింగ్, అంకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీ ప్ శైనీ, కార్తీక్ త్యాగి

గుజరాత్ టైటాన్స్ : గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, ప్రసిద్ధ కృష్ణ, సిరాజ్, అశోక్ శర్మ.

FAQ's:


1. KKR vs GT మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ఈ మ్యాచ్ Narendra Modi Stadium లో జరుగుతుంది.


2. KKR ఎందుకు ఒత్తిడిలో ఉంది?

కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉంది.


3. గుజరాత్ టైటాన్స్ ఫామ్ ఎలా ఉంది?

గుజరాత్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది.


4. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు ఎవరు?

Shubman Gill, Jos Buttler గుజరాత్‌కు కీలకం కాగా, కేకేఆర్‌కు Ajinkya Rahane కీలక పాత్ర పోషించాలి.


5. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది?

అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండి, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.


6. KKR vs GT హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది?

ఇరు జట్లు నాలుగు సార్లు తలపడగా గుజరాత్ మూడు మ్యాచ్‌లు గెలిచింది.


7. కేకేఆర్ ఓటములకు ప్రధాన కారణం ఏమిటి?

బ్యాటింగ్, బౌలింగ్ రెండూ విఫలమవడం వల్ల కేకేఆర్ ఓటములు చవిచూస్తోంది.


8. గుజరాత్ బలాలు ఏమిటి?

బట్లర్, గిల్ ఫామ్‌లో ఉండడం మరియు రషీద్ ఖాన్ స్పిన్ బలం గుజరాత్‌కు ప్లస్.


9. ఈ మ్యాచ్‌లో ఎవరు ఫేవరెట్?

ప్రస్తుత ఫామ్ ప్రకారం గుజరాత్ టైటాన్స్ ఫేవరెట్‌గా ఉంది.


10. KKR తొలి విజయం సాధించే అవకాశం ఉందా?

బ్యాటింగ్, బౌలింగ్ మెరుగుపడితే కేకేఆర్‌కు అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

20 నుంచి టీసీఏ ఆల్‌స్టార్ టీ20 సూపర్ లీగ్

ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ ఔట్

RCB vs LSG: విరాట్ కోహ్లీ దుమ్మురేపగా బెంగళూరు ఘన విజయం

MI vs PBKS 2026: రోహిత్ ఆడతాడా? ముంబై ఒత్తిడిలో నేడు కీలక పోరు

KKR కష్టాలు మరింత పెరిగాయి: రహానేపై రూ.12 లక్షల జరిమానా, పాయింట్ల పట్టికలో అట్టడుగున

చరిత్ర సృష్టించిన వైశాలి