01-10-2025 12:26:06 AM
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విన్నపం
సదాశివపేట, సెప్టెంబర్ 30 :సింగూర్ ప్రాజెక్ట్ నుండి సోమవారం రాత్రి 11 గేట్లు ఎత్తడంతో సదాశివపేట మండలంలోని కొల్కూర్, పొట్టిపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్డుమార్గం వరద నీటిలో మునిగిపోయింది. ఆ గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన రోడ్డు ఇదే కావటంతో వరద ఇలాగే కొనసాగితే మా పరిస్థితి ఏమిటని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వరద నీరు భారీగా రావడంతో తమ పంట భూములు పూర్తిగా ము నిగిపోయాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు. తమకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, ఉన్నత అధికారులు స్పందించి తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు.