ఆలే నరేంద్ర ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి
ముషీరాబాద్,ఆగస్టు 20(విజయక్రాంతి): ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన టైగర్ ఆలె నరేంద్ర 80వ జయంతిని పురస్కరించుకుని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్రావు ఆధ్వర్యంలో జరి గిన కార్యక్రమంలో పలువురు బీసీ సంఘా లు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై ఆలె నరేంద్ర చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మా ట్లాడుతూ ట్యాంక్బ్ంప ఆలె నరేంద్ర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చే శారు. ఆయన పోరాట స్ఫూర్తి, ధైర్యం, ప్రజా సేవను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ, బీజేపీ రా ష్ట్ర నాయకుడు బుర్ర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ టైగర్ నరేంద్ర ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అని కొనియాడారు. బీసీ వర్గాల నాయకుడిగా ప్రజలకు భరోసాగా నిలిచారని, ఆయన జ్ఞాపకాలను కాపాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఢిల్లీలో నరేంద్ర మోదీ ఉంటే, తెలంగాణలో తమకు మరో నరేంద్ర అంటే టైగర్ నరేంద్ర అని పేర్కొన్నారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినా సామాజిక తెలంగాణ సాధన కోసం ఇంకా పోరాటం చేయాల్సి ఉందన్నారు. బహుజన వర్గాల వీరుల చరిత్రను మరుగున పడకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వాహకుడు కటకం నర్సింగ్రావు మాట్లాడుతూ టైగర్ నరేంద్ర జయంతి కే వలం ఒక రోజు వేడుకగా కాకుండా, ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకెళ్లే చారిత్రక కార్యక్రమంగా నిలవాలన్నారు.
సర్దార్ స ర్వాయి పాపన్న గౌడ్, కొండా లక్ష్మణ్ బా పూజీ, కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ తదితరుల పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎ మ్మెల్యే వన్నాల శ్రీరాములు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గు జ్జ సత్యం లు ప్రసంగించారు. ఈ కార్యక్రమ ంలో ఆలె నరేంద్ర కుమారుడు జితేంద్ర, కా ర్యక్రమ కన్వీనర్ మార్కండేయ,
గంగపుత్ర స ంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, సీనియర్ జ ర్నలిస్ట్ పాశం యాదగిరితో పాటు కోళ్ల భా స్కరరావు, గడ్డం శ్రీనరసింహ గౌడ్, దొంతు ఆనందం, పూస నరసింహ బెస్త, నేరెళ్ల దేవేందర్, గంధమల్ల ఆనంద్కుమార్ గౌడ్, పుల్కా లక్ష్మీనారాయణ, బొంగు ప్రసాద్ గౌడ్, కత్తుల సుదర్శన్, కత్తి వెంకటస్వామి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు






