calender_icon.png 6 October, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర పండుగగా కొమురం భీం వర్ధంతి

06-10-2025 07:32:29 PM

సీఎం, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్యుడు, నిజాం నిరంకుశ పాలనపై విరోచిత పోరాటం చేసి అసువులు బాసిన కుమ్రం భీం వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఆయన తెలిపారు. మంగళవారం కెరమేరి మండలంలోని జోడేఘాట్ లో జరిగే భీం వర్ధంతికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హాజరుకానున్నట్లు వారు తెలిపారు.