calender_icon.png 6 October, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా దుర్గామాత నవ జ్యోతి యూత్ క్లబ్ నిమజ్జన శోభాయాత్ర

06-10-2025 07:35:10 PM

మేళతాళాలు కోలాటాలతో మారుమోగిన పరిసరాలు..

ఉప్పల్ (విజయక్రాంతి): శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో మల్లాపూర్ నవజ్యోతి యూత్ క్లబ్ ఏర్పాటు చేసిన  దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. యూత్ క్లబ్ నాయకులు నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా అమ్మవారి విగ్రహం ముందు వివిధ వేషధారణలతో వివిధ నృత్యాలు పలువురుని ఆకట్టుకుంది. మేర తాళాలు కోలాటాలతో పరిసర ప్రాంతమంతా మార్మోగింది. జై బోలో దుర్గామాత జే అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆటపాటలతో అమ్మవారి శోభాయాత్రను నిర్వహించారు. అమ్మవారి శోభాయాత్రకు మహిళలు పెద్దఎత్తున పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆటపాటల అనుగుణంగా యువత డాన్సులు చేస్తూ గంగమ్మ ఒడికి చేర్చేందుకు యూత్ నాయకులు కాప్రా చెరువుకు భారీ ఊరేగింపు వెళ్లి నిమజ్జనం చేశారు.