06-10-2025 07:51:19 PM
బాన్సువాడ (విజయక్రాంతి): వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో పలువురికి తీవ్ర గాయాలు అయిన ఘటన సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద నుంచి ఆటోలో పదిమంది బాన్సువాడకు వస్తున్న క్రమంలో తాడ్కోల్ శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులతో పాటు ఆటో పైన ఐరన్ సలాకాలు తరలిస్తుండడంతో అధికలోడుతో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న ఇద్దరికీ తలకు, కాళ్లకు బలమైన గాయాలు కావడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఎక్కువమంది మహిళలు ప్రయత్నిస్తున్నారు.