calender_icon.png 5 September, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

76 వేలకు లడ్డు దక్కించుకున్న గొలుసుల కొమురయ్య

05-09-2025 07:49:29 PM

పటాన్ చెరు (విజయక్రాంతి): విగ్నేశ్వరి కటాక్షంతో విజ్ఞాలన్ని తొలగిపోయి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని బీరంగూడ వడ్డెర సంఘం అధ్యక్షుడు గొలుసుల కొమరయ్య పేర్కొన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మంజీరా నగర్ క్షత్రియ యూత్ అసోసియేషన్ మందిరంలో వినాయక లడ్డు వేలం పాటలో బీరంగూడ వడ్డెర సంఘం అధ్యక్షుడు గొలుసుల కొమురయ్య 76,000కు కైవసం చేసుకున్నారు. వేలం పాటలో లడ్డు దక్కించుకోవడంతో గణేషుడు కటాక్షం లభించి పాడిపంటలు సస్యశ్యామలమై ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధి దిశగా సాగడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర గంగయ్య, గొలుసుల వెంకటేష్, సూర సతీష్,నరేష్, కర్ణకర్, లింగయ్య, కాలనీ ప్రజలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.