05-09-2025 07:47:50 PM
గాంధారి,(విజయక్రాంతి): గాంధారిలో మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం రాత్రి ప్రారంభమైన గణేష్ నిమజ్జనం శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు గాంధారి మండల కేంద్రంలో గురువారం రాత్రి గణేష్ శోభాయాత్రను గాంధారి మాజీ జడ్పిటిసి హరాలే తానాజీ రావు, గాంధారి తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవులు, స్థానిక ఎస్సై ఆంజనేయులు కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. శుక్రవారం శోభయాత్ర తో పాటు నిమజ్జనం నిర్వహించనున్నారు.
ఈ మేరకు మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా నుండి ప్రారంభమైన శోభాయాత్ర మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భాజా భజంత్రీలు, నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ నృత్యంలు చేస్తూ శోభాయాత్రను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. గణేశులను నిమజ్జనం చేసే గాంధారి పెద్దవాగు వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధారి ఎస్సై ఆంజనేయులు బందోబస్తు నిర్వహించారు.