డ్రగ్స్ నిర్మూలనకు కోనరావుపేట పోలీసుల ప్రత్యేక తనిఖీలు
నార్కోటిక్ జాగిలంతో కిరాణా, పాన్ షాపుల్లో తనిఖీలు
కోనరావుపేట, మే 22 (విజయక్రాంతి):కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిలం సహాయంతో తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని కోనరావుపేట ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన, భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.






