calender_icon.png 18 February, 2026 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కోట ఇన్‌స్టిట్యూట్ విద్యార్థుల అగ్రగామి ప్రతిభ

18-02-2026 12:26:33 AM

మొదటి బ్యాచ్‌లోనే జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్సంటైల్ విద్యార్థులను అభినందించిన కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఐఐటీ జేఈఈ మెయిన్స్2026 మొదటి బ్యాచ్, మొదటి విడత పరీక్ష ఫలితాలు మం గళవారం విడుదల కావడంతో కరీంనగర్లోని కోట ఇన్స్టిట్యూట్ విద్యార్థులు జాతీయస్థాయిలో అగ్రగామి పర్సంటైల్స్ సాధించి ప్ర తిభ చాటారు. మొదటి బ్యాచ్ నుండే అత్యుత్తమ ఫలితాలు సాధించడం విద్యాసంస్థ ప్ర తిష్టను మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా కరీంనగర్లోని కో ట ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి న కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి. అం జిరెడ్డి మాట్లాడారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కోట ఇన్స్టిట్యూట్ విద్యార్థులు జాతీ యస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు.

ఫలితాల్లో జి. సా యి అక్షిత్ 98.15 పర్సంటైల్, ఏ. స్నేహమాదిరి 96.44, జి. కృతిక 95.19, ఏ. అక్షర్ యాదవ్ 95.18, జి. నిఖిల్ శ్రీ వాస్తవ 94.07, సి.హెచ్. హాస్య రెడ్డి 93.85, టీ. విజయ్ యాదవ్ 90.34 పర్సంటైల్స్ సా ధించి ప్రతిభ చాటారు. అదేవిధంగా మరెం తో మంది విద్యార్థులు 90 శాతం పైగా పర్సంటైల్స్ సాధించడం విశేషమన్నారు. మొదటి బ్యాచ్ నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఈ అఖండ విజయాన్ని సాధించామని డాక్టర్ డి. అంజిరెడ్డి తెలిపారు. రెండో విడత జేఈఈ మెయిన్స్కు సిద్ధమవుతున్న విద్యార్థులు సీబీఎస్‌ఈ, ఎస్సెస్సీ పరీక్షలు పూర్తయ్యాక మరింత శ్రద్ధతో చదివి ఇంకా అధిక పర్సంటైల్స్ సాధించాలని సూచించారు.

భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్లోనే అత్యుత్తమ శిక్షణ అందించి ఐఐటీ లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల విజయాలతో కోట ఇన్స్టిట్యూట్ మరింత ముందుకు సాగుతుందని, రాబోయే ఫలితాల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.