07-01-2026 03:52:38 PM
కోదాడ: కోదాడ మండలం సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా చనుపల్లి గ్రామ సర్పంచ్ కొత్త గురవయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో 15 గ్రామాల సర్పంచులు పాల్గొని ఏకగ్రీవం తెలిపారు. సర్పంచ్ల సమస్యలపై పోరాడుతానని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గురవయ్య తెలిపారు.