calender_icon.png 8 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల భద్రత కోసమే ట్రాఫిక్ ఆంక్షలు: సీఐ శివశంకర్

07-01-2026 03:50:52 PM

కోదాడ: ప్రజల భద్రత కోసమే ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశామని పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పట్టణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణం గుండా వెళ్లే జాతీయ రహదారి కోదాడ బైపాస్‌లోని కట్టకొమ్ముగూడెం చౌరస్తాను జనవరి 8వ తేదీ నుంచి తాత్కాలికంగా పూర్తిగా మూసివేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

పండుగ అనంతరం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మళ్లీ రహదారిని తెరుస్తామని తెలిపారు.పండుగ రోజుల్లో భారీ వాహనాలు, ప్రయాణికుల రద్దీ పెరగడంతో ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొన్న సీఐ, ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వాహనదారులు హుజూర్‌నగర్ వంతెన క్రింద ఉన్న సేవా మార్గాన్ని వినియోగించాలని పోలీసులు సూచించారు