calender_icon.png 27 July, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీర్జాదిగూడలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2025 02:25:43 PM

మేడిపల్లి: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు(KTR birthday celebration)  జన్మదిన వేడుకలను  పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి  లో బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.  ఫిర్జాది గూడ  మాజీ మేయర్ జక్క  వెంకటరెడ్డి  ఆధ్వర్యంలో  బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో వేడుకలు జరిగాయి,  కేటీఆర్ పుట్టినరోజు  సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు  తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.