24-07-2025 02:23:04 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR birthday celebrations) జన్మదినోత్సవ సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తో కలిసి, కంచర్ల కేక్ కట్ చేసి ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు ముఖ్య కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని విజయ పదంలో నడిపించే విధంగా భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నల్లగొండ నియోజకవర్గ ప్రజల పక్షాన,నాయకుల పక్షాన, కార్యకర్తలు అభిమానుల పక్షాన, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు.
బిఆర్ఎస్ పార్టీ పాలన లో సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు కాంగ్రెస్ పాలకులు అధోగతి పాలు చేస్తున్నారని, మళ్లీ కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ చిరా పంకజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, మాజీ ఆర్.ఓ మాలే శరణ్య రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్, మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి కనగల్ నల్లగొండ,మండల పార్టీ అధ్యక్షులు, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగొని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.