calender_icon.png 14 August, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు..

24-07-2025 06:23:19 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఆఫీస్ లో కేటీఆర్ బర్త్డే వేడుకలు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిర్వహించారు. ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో కేటీఆర్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని స్థానిక హాస్పటల్ లో పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  బెల్లంపల్లి మున్సిపల్ మాజీ  వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు నూనేటి సత్యనారాయణ,బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.