24-07-2025 06:21:29 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేడగం లక్ష్మీ నారాయణ రెడ్డి, కొనకంచి శ్రీను, సానికొమ్ము శంకర్ రెడ్డి, పోడియం నరేందర్, బొల్లు సాంబ, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.