calender_icon.png 5 August, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల శక్తి ముందు.. ప్రభుత్వం తలవంచక తప్పదు: కేటీఆర్

19-09-2024 11:10:04 AM

హైదరాబాద్: రుణమాఫీకి పోరాడుతున్న రైతులను అరెస్టు చేయడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన వారి అరెస్టును కేటీఆర్ ఖండించారు. రైతులను, సంఘాల నేతలను పోలీస్ స్టేషన్ లో నిర్భంధించడం దారుణమన్నారు. అక్రమంగా నిర్భంధించిన రైతులను తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఒకేసారి రూ. 2 లక్షలు రుణమాఫీ హామీ ఇచ్చి మోసం చేసినందుకే ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.