calender_icon.png 5 August, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ మెట్రో 'ఎక్స్' అకౌంట్ హ్యాక్

19-09-2024 10:49:28 AM

హైదరాబాద్‌: హైదరాబాద్ మెట్రో రైలు ఎక్స్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. ఎక్స్ అకౌంట్ హ్యాక్ పై మెట్రో రైలు యాజమాన్యం స్పందించింది. @ltmhyd అకౌంట్ హ్యాక్ గురైందని, అకౌంట్ ను సంప్రదించాడానికి ఎవరూ ప్రయత్నించవద్దు అని మెట్రో సూచించింది. త్వరగా ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. త్వరలోనే సమాచారం అందిస్తామని వెల్లడించింది. అప్పటి వరకు ఎలాంటి లింక్స్ గానీ, పోస్టులపై గానీ క్లిక్ చేయకుండా జగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

అటు సామాజిక మాద్యమాల్లో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) బాగా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. మెట్రోకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోని మెట్రో ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇక హైదరాబాద్ మెట్రో అకౌంట్ హ్యాక్ అయిందని తెలిసిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.