calender_icon.png 5 January, 2026 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్​ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో ఉరితీయాలి

04-01-2026 12:23:25 PM

  1. సర్వభ్రష్ట ప్రభుత్వానికి అధినేత రేవంత్ 
  2. కేసీఆర్ చావు కోరుకునే రాబందు రేవంత్
  3. అల్పుడి చేతిలో తెలంగాణ ఉన్నందుకు బాధపడుతున్నాం
  4. నదీ జలాలపై కాంగ్రెస్ ద్రోహం
  5. కేసీఆర్ పై రేవంత్ విమర్శలకు కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీని అశోక్ నగర్ నడి చౌరస్తాలో(Ashok Nagar Chowrasta) ఉరి తీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్(KCR) పై రేవంత్ రెడ్డి విమర్శలకు కేటీఆర్(BRS Working President KTR) కౌంటర్ ఇచ్చారు. నదీ జలాలపై దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను కేసీఆర్ సాధించారని కొనియాడారు. అధికారమదంతో మిడిసిపడుతూ మాట్లాడటం సరికాదని కేటీఆర్ హెచ్చరించారు. పదే పదే కేసీఆర్ చావు కోరుకునే రాబందు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సమైక్యవాదుల సంచులు మోసిన అల్పుడి చేతిలో తెలంగాణ ఉన్నందుకు బాధపడుతున్నామని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప ఏమీ లేదని పేర్కొన్నారు. మేడిగడ్డలా చెక్ డ్యాంలను బాంబులతో పేల్చేస్తున్నారని మండిపడ్డారు. ఉరితీయాలంటే ముందు రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఉరితీయాలని కేటీఆర్ తెలిపారు. అశోక్ నగర్ అడ్డా మీద 2 లక్షల ఉద్యోగాలిస్తామని మాట తప్పినందుకు, రాహుల్ ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుకు, వరంగల్ లో రాహుల్ గాంధీని ఉరితీయాలన్నారు. మీ ఎగవేతలకు మిమ్మిల్ని ఎన్నిసార్లు ఉరితీయాలని కేటీఆర్ ప్రశ్నించారు. 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లు ఉరితీయాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సాక్షిగా రేవంత్ రెడ్డి నికృష్టుడిలా జుగుప్సాకరమైన భాష మాట్లాడుతుంటే, స్పీకర్ గడ్డం ప్రసాద్ చూస్తూ కూర్చోవడం బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకోవడానికే అలా ప్రవర్తిస్తున్నాడని అందరికీ అర్థమైందని తెలిపారు.