04-01-2026 11:48:45 AM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల బురహాన్పురం గ్రామపంచాయతీ పరిధిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మరిపెడ ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం బచ్చోడు తండాకు చెందిన రవీందర్ ద్విచక్ర వాహనంపై మరిపెడ మండల కేంద్రం నుంచి బచ్చోడుకు వస్తుండగా బృహన్ పురం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రవీందర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.