22-07-2025 07:41:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): మంగళవారం సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో ప్రజలకు ఎన్‌డీఆర్‌ఎఫ్(NDRF) బృందం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణపై అవగాహన కల్పించారు. కమాండెంట్ అమర్ ప్రతాప్ సింగ్(Commandant Amar Pratap Singh) నేతృత్వంలోని బృందం అకాల వర్షాలు సంభవించినపుడు, ఇతర ప్రమాదాలు, విపత్కర సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ప్రాణ రక్షణ, తదితర అంశాలపై మాక్ డ్రిల్ రూపంలో అవగాహన కల్పించారు. అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సోన్ ఎంపిడివో, డిప్యూటీ తహసిల్దార్, ఆర్ఐ, గ్రామస్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.