22-07-2025 07:33:21 PM
సూర్యాపేట (విజయక్రాంతి): ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి(Municipal Commissioner Hanumantha Reddy) అన్నారు. వందరోజుల పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం 43వ వార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు వంటి అంశాలపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. ప్రజలు ఇచ్చే సూచనలతో మున్సిపాలిటీ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఇ సత్యరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏ.ఇ.తిరుమలయ్య, యండి.గౌసుద్దీన్, అజీముద్దీన్ ,ఇండ్ల మనోజ్, టీఎంసీ శ్వేత, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.