calender_icon.png 23 July, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ రహిత సమాజం కోసం కృషి చేయాలి

22-07-2025 07:46:32 PM

మండల వైద్యాధికారి భూక్యా నగేష్ నాయక్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి 2025 నాటికి భారతదేశం నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్(Mandal Medical Officer Bhukya Nagesh Naik) కోరారు. మంగళవారం మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో ఏసీఎఫ్ టీబీ యాక్టివ్ కేసు నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించి, 20 మందికి వైద్య పరీక్షలు జరిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎవరికైనా టీబీ లక్షణాలు ఉన్నట్లయితే సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా తగ్గుతుందని చెప్పారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, 60 ఏళ్లు పైబడిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించే మందులను వాడి తగ్గించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ పర్సన్ కుంభం వీరయ్య, ల్యాబ్ టెక్నీషియన్ చొక్కాయ్య, వస్రిత, హెల్త్ అసిస్టెంట్లు శ్రీనివాస్, సరస్వతి, ఊర్మిళ, ఆశాలు కవిత, రోజా తదితరులు పాల్గొన్నారు.