calender_icon.png 23 July, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకితం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టై, బెల్టు, షూ పంపిణీ

22-07-2025 07:38:23 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో అంకితం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముక్కాల వెంకటరమణారెడ్డి తన అమ్మమ్మ భీమిరెడ్డి యశోదమ్మ జ్ఞాపకార్థం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టై, బెల్టు, షూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంకితం చారిటబుల్ ట్రస్ట్ వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో పాఠశాలల విద్యార్థులకు టై, బెల్టు, షూ పంపిణీ చేశామని అన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ గ్రామం చరిత్రలో లిఖించబడిన గ్రామంగా చెప్పుకోవచ్చునని అన్నారు. ఈ గ్రామంలో ఎంతోమంది ఉద్దండులు ఉన్నత స్థానానికి చేరారని అన్నారు.

ప్రస్తుతం విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకుసాగాలని అన్నారు. గ్రామంలో పేరుగాంచిన నాయకులు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని గ్రామ ప్రతిష్టను నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంకితం చారిటబుల్ ట్రస్ట్ నాయకులు మల్లు సుధీర్ రెడ్డి ,మల్లు కపోతం రెడ్డి, మల్లు ఉపేందర్ రెడ్డి, మల్లు దయాకర్ రెడ్డి,దాచేపల్లి సింగా రెడ్డి ,గోలి కేశవరెడ్డి ,మెంత బోయిన సింహాద్రి, వెంకటేష్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాటి  సుధీర్ రెడ్డి ,శ్రీను ,ఉపాధ్యాయులుప్రభాకర్ ,వెంకటమల్లు,పర్వీనా ,నాగలక్ష్మి ,లక్ష్మీ బాయి ,శారద ,ప్రాథమిక పాఠశాల చైర్మన్ పార్వతమ్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.