calender_icon.png 23 July, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందుల్లో గ్రామ కార్యదర్శులు: బెల్లంకొండ

22-07-2025 08:00:01 PM

కోదాడ/నడిగూడెం: ఆర్థిక ఇబ్బందుల్లో గ్రామ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ(CPM Mandal Secretary Bellamkonda Satyanarayana) ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, గ్రామాలలో మోటర్లు కాలిపోయిన, వీధిలైట్లు వెలగకపోయినా, పారిశుద్ధ్య పనులను అప్పులు చేసి పనులు చేస్తున్నారని గత 17 నెలలుగా ఒక్కొక్క గ్రామ కార్యదర్శి సుమారుగా 2 లక్షల రూపాయల పైనే పెట్టుబడి పెట్టినట్టు గ్రామ కార్యదర్శిలు తెలిపారన్నారు. గ్రామ కార్యదర్శులకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఒకవైపు మాజీ సర్పంచులకి రావలసిన నిధులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని నిధులను విడుదల చేసి మాజీ సర్పంచులను కార్యదర్శులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.