17-06-2025 12:01:16 AM
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ సినీ హీరో మహేష్‌బాబును డైలాగులు కొడుతున్నాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్‌బాబులా ఫీల్ అవుతూ అసవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని చామల మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు రోహిన్ రెడ్డి, భాస్కర్ యాదవ్, శ్రీకాంత్, మల్రెడ్డి రామి రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకు వెళ్తేనే సీఎం అవుతానని కేటీఆర్ కలలు కంటుండని సెటైర్ వేశారు. కవిత ఢిల్లీలో జైలుకెళ్లింది.. తాను హైదరాబాద్‌లో జైలుకెళ్తే పక్కా సీఎం అవుతానని కేటీఆర్ తన సన్నిహితుల వద్ద చెబుతున్నాడన్నారు.
కేటీఆర్ ఉద్యమకారుడు కాదనే విషయం తెలుసుకోవాలని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు కాబట్టే విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. అరెస్టు కావాలని కేటీఆర్ ఓవర్ యాక్షన్ చేస్తుండని, గతంలో జైలుకు వెళ్లానని, ఎన్నిసార్లునా వెళ్తానని కేటీఆర్ అవాకులు, చెవాకులు పేలుతున్నాడని విమర్శించారు. ఫార్ములా వన్ కేసులో ఐఏఎస్ అరవింద్‌కుమార్ కీలకమైన వ్యక్తి అని, ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీళ్ల అవసరాల కోసం తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా చేస్తారని, గతంలో కేటీఆర్ మిత్రుడు కేదార్ విదేశాల్లో చనిపోయాడని, కేటీఆర్ ప్లాన్‌తోనే ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లి దాక్కున్నాడని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.