12-01-2026 03:36:00 AM
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, జనవరి 11 (విజయక్రాంతి): ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డివి చీకటి ఒప్పందాలు అని మాజీ మంత్రి, సూ ర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి కృష్ణా, గోదారి జ లాలను ఆంధ్రకు దోచిపెడుతున్నాడని విమర్శించారు. బనకచర్ల పేరుమార్చి నల్లమల్ల సాగర్ అంటూ నీళ్ల దోపిడీ చేస్తున్నారన్నా రు. చంద్రబాబును సంతృప్తి పరచడమే రేవంత్ లక్ష్యమని మండిపడ్డారు. మొదటి నుంచి కూడా తెలంగాణకు జాతీ య పార్టీలే శత్రువులన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణ నీటి హ క్కులను కాపాడుకుందామని చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాయిం చినప్పుడు లేని సోయి ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే గొంతెత్తి మొ త్తుకుంటున్నారని విమర్శించారు. గతం లో ఆరోపణలు వస్తే స్పందించని పైస్థాయి అధికారులు.. కాంగ్రెస్ మంత్రులపై వచ్చాయని స్పందించడం సరికాదన్నారు. గాంధీ భవన్, సీఎం ఆఫీస్ నుంచి గోస్ట్ సై ట్లు పనిచేస్తున్నయని, వాటి నుంచే ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని వార్తలు వస్తున్నాయన్నారు.
ముందు వాటి ని బంద్ పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదన్నారు. తప్పుడు రాతలు ఎవరిపై వచ్చినా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ప్రధాన శత్రువు అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు, కబ్జాలు, బెదిరింపులు, అక్రమ కేసులు పెరిగాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందన్నారు. సమావే శంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, నరసింహ రెడ్డి పాల్గొన్నారు.