calender_icon.png 8 May, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతి భ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్

08-05-2025 12:23:40 AM

కారు కూతలు కూస్తే  ఊరుకునేది లేదు ఫామ్ హౌస్ పాలన కాదు.. ఇది ప్రజా పాలన

వనపర్తి, మే 7 ( విజయక్రాంతి ) :  రాష్ట్ర ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  పై  నిరాధార ఆరోప ణలు చేస్తూ మతి భ్రమించినట్లుగా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బుధవారం  ఒక ప్రకటన ద్వారా ఘాటుగా విమర్శించారు.

తండ్రి చాటు బిడ్డ గా రాజకీయాల్లోకి వచ్చినా మాజీ మంత్రి కేటీఆర్ పదేళ్లు అవినీతి అధికారం అనుభవించిన నీవా  మా సీఎం గురించి మాట్లాడేదన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల చితిమంటల మీద పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుందినువ్వు, మీ నాన్న కెసిఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల పాటు రాజభోగాలు అనుభవించి తెలంగాణ ప్రజలకు చిప్ప మిగిల్చింది మీరు కదా అని మీరు తెలం గాణను ఎలా దోచుకున్నరన్న దాని   గురించే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు , ఉద్యోగులు చెప్పారన్నారని వారికి వాస్తవ పరిస్థితిని వివరించారన్నారు.

పదేళ్లలో ప్రభుత్వ ఉద్యో గులను ఎంత హీనంగాచూశారో అందరికీ తెలుసునని మీ ప్రభుత్వ హయం లో ఏ నాడైన మొద టి తేదీన ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకున్నారా ఒక్క రోజైనా వాళ్లనుపిలిచి మాట్లాడారా ఉద్యోగుల పైన ప్రేమ ఉంటే  8వేల కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెట్టి పోయారన్నారు. 2016 లో మీ నాన్న కెసిఆర్ చైనా, సింగపూర్ ఎలా వెళ్లారోనీకు తెలియదా అని హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తానా తందానా బ్యాచ్ తో సింగపూర్, చైనా వెళ్లాడని 2014 నుంచి 2022 వరకు ప్రతి యేడాది సరాసరి 14 సార్లు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని 2022,2023 లో కేసీఆర్ ఏకంగా21 సార్లు ఢిల్లీ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లారన్నారు.