16 March, 2026 | 4:42 AM

డ్రగ్స్ టెస్టుకు కేటీఆర్ సిద్ధం కావాలి

16-03-2026 12:29 AM
  1. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానం 
  2. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి 
  3. తెలంగాణను డ్రగ్స్ మయంగా మార్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే 
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రా న్ని డ్రగ్స్ మయంగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అనుమానాలు వ్యక్తవుతున్న యాని ఆరోపించారు. అవసరమైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం డ్రగ్స్ పరీక్షలు చేసుకొని లోనికి వెళ్దామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, కొకైన్ లాంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పెంచిన ఘనత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపిం చారు. తప్పు చేసిన వారే ఇప్పుడు ఉల్టా చోర్ అన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాల న్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల నేతృత్వంలో డ్రగ్స్ కంట్రోల్ కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఈగల్ టీమ్ పనిచేస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని కొనియాడారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, ఆ ప్రయ త్నానికి మనవంతు సాయం చేయాలని, కానీ పోరాటాన్ని నిర్వీర్యం చేసే పనిచేయవద్దని సూచించారు.

ఈగల్ బృం దం రాజ కీయాలకు అతీతంగా పనిచేస్తున్నదని, ఆ బృందం తన కర్తవ్యాన్ని నెరవేరు స్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్‌హౌస్‌లోని డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మంది ఉన్నారని చెప్పారు. అందులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేతోపాటు మరి కొంద రికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు.