16 March, 2026 | 3:30 AM

కాన్షీరామ్ స్ఫూర్తితో అందరూ ఎదగాలి

16-03-2026 12:29 AM

ఎమ్మెల్యే బిఎల్‌ఆర్

మిర్యాలగూడ, మార్చి 15 : బహుజన సమాజ్ పార్టీ ( బీఎస్పీ ) వ్యవస్థాపక అధ్యక్షుడు, దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అ విశ్రాంతంగా పోరాడిన  మహానేత మాన్యశ్రీ కాన్సిరామ్ స్ఫూర్తితో బహుజనులందరూ ఎదగాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్‌ఆర్) అన్నారు.

ఆదివారం కాన్సిరాం 92వ జయంతి సందర్భంగా పట్టణంలోని వై జంక్షన్ నందు మున్సి పల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, పలు సంఘాల నాయకులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల నుండి స్ఫూర్తి పొందిన కాన్సీ రామ్ సమాజంలో మార్పు కోసం ఉద్యమించారని, ఓటు మనది సీటు మీది అనే నినాదంతో 1984లో బిఎస్పీని స్థాపించి రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు.

సామాజిక న్యాయం కాకూడదు... సామాజిక పరివర్తన కావాలి అనే నినాదంతో పాలకు లను మార్చడం ద్వారానే సమాజం మారుతుందని బోధించిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ రాజు, తాళ్లపల్లి రవి, ముళ్లగిరి కాంతయ్య, అంజయ్య, బొప్పన నగేష్, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, దిలావర్పూర్ సర్పంచ్ బెజ్జం సాయి, కిరణ్, మొండికత్తి లింగన్న, మచ్చ ఏడుకొండలు, మారం శ్రీనివాస్, బహుజన సంఘాల నాయకులు, కుల, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.